: మెదక్ జిల్లా జోగిపేటలో టీఆర్ఎస్ విజయోత్సవ సభ
మెదక్ జిల్లా జోగిపేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ సభ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పారిశ్రామిక వేత్త బీబీ రావ్ పాటిల్ టీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాజకీయ అవినీతిని అంతం చేయడమే తన లక్ష్యమని చెప్పారు.