: మోడీ ముసుగులో పవన్ కల్యాణ్!: వాసిరెడ్డి పద్మ

దిగజారుడు రాజకీయాలకు ఆదిగురువు పవన్ కల్యాణ్ అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, జనసేన పార్టీ అంటూ ప్రజల ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ ముసుగు తొలగిందని అన్నారు. చంద్రబాబు నాయుడు గొంతును పవన్ కల్యాణ్ అద్దెకు తెచ్చుకున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్, మోడీల ముసుగును చంద్రబాబు వేసుకున్నారని ఎద్దేవా చేశారు.

బాబును విమర్శించనందుకే ఎల్లో మీడియా పవన్ కల్యాణ్ కు వత్తాసు పలుకుతోందని అన్నారు. సామాన్య ప్రజలు ఆలోచించినట్టుగా పవన్ కల్యాణ్ ఆలోచించలేకపోతున్నారని పద్మ విమర్శించారు. రామోజీరావు, వేమూరి రాథాకృష్ణలకు ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం అవసరమని అన్నారు. అలాగే బాబును నమ్ముకున్న పారిశ్రామిక వేత్తలకు కూడా బాబు గెలుపు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ కూడా అందులో భాగమేనని ఆమె తెలిపారు. 'ఈనాడు'కు మోడీ ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాడని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో ఓట్లు వస్తాయనే ఆశతో 'ఈనాడు' పవన్ కల్యాణ్ ను ఆకాశానికి ఎత్తేస్తోందని ఆమె విమర్శించారు.

More Telugu News