: 'నొప్పింపక తానొవ్వక' ప్రచారం చేసుకుంటున్న బప్పీలహరి

'నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి' అంటుంది సుమతీ శతకం. సింహాసనం, గ్యాంగ్ లీడర్, డిస్కోడాన్సర్, డర్టీపిక్చర్ వంటి విజయవంతమైన సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు బప్పీలహరి అదే పద్దతిని పాటిస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. రాజకీయాలంటే ఎత్తులు, జిత్తులు, చిత్తులు, గజకర్ణగోకర్ణవిద్యలు అన్నీ ప్రదర్శిస్తేనే విజయం దక్కుతుందని రాజకీయ పండితులు చెబుతుంటారు.

అయితే ఇవేవీ తనకు తెలియనట్టు, వీటితో తనకు సంబంధం లేనట్టు సంగీత దర్శకుడు బప్పీదా పని చేసుకుపోతున్నాడు. ప్రత్యర్థులను విమర్శించకుండా, తన పాటలు, బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి ఉన్న జనాదరణే తనను గెలిపిస్తుందని స్పష్టం చేస్తున్నాడు. బప్పీదాగా పిలుచుకునే బప్పీలహరి మహారాష్ట్రలోని శ్రీరాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.

More Telugu News