: మోడీని ముక్కలుగా కోస్తానంటున్న కాంగ్రెస్ నేత

ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు విచక్షణ కోల్పోతున్నారు. నోరు అదుపు తప్పుతోంది. ఉత్తరప్రదేశ్ లో సహరాన్ పూర్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇమ్రాన్ మసూద్ తన వ్యాఖ్యలతో పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ఇమ్రాన్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఓ సభలో ఇమ్రాన్ చేసిన ప్రసంగం వీడియో బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ గుజరాత్ కాదని... గుజరాత్ లో ముస్లింల జనాభా 4శాతమే ఉండగా, ఉత్తరప్రదేశ్ లో వారి జనాభా 22శాతంగా ఉందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. మోడీపై పోరాటం చేస్తానని, ఆయనకు ఎలా సమాధానమివ్వాలో తనకు తెలుసన్నారు. తాము మోడీని పీసులు పీసులు చేస్తామని హెచ్చరించారు. దీనిపై స్థానిక ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. ఇమ్రాన్ ప్రసంగంతో కూడిన వీడియోను పరిశీలించాక చర్యలు తీసుకుంటామని చెప్పారు.

More Telugu News