: టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మళ్లీ 'పొత్తు' చర్చలు
గత కొంత కాలంగా కత్తులు దూసుకుంటున్న టీకాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య 'పొత్తు' పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉదయం వరకు ఢిల్లీలో వున్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల అధిష్ఠానం సూచనలతో చర్చలకు అందుబాటులో ఉండడానికి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. టీఆర్ఎస్ నుంచి పిలుపు వస్తే... ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చలు ప్రారంభమవుతాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ మైత్రీబంధం నాటకీయంగా మలుపు తిరిగిన నేపథ్యంలో, ఈ రోజు వెలువడాల్సిన టీకాంగ్రెస్ అభ్యర్థుల జాబితా తాత్కాలికంగా వాయిదా పడింది. టీఆర్ఎస్ తో చర్చల అనంతరమే అభ్యర్థుల వివరాలను టీకాంగ్రెస్ ప్రకటించనుంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ తో టీఆర్ఎస్ నేతల చర్చలు ఇప్పటికే కొనసాగాయా? ఒకవేళ కొనసాగి ఉంటే ఏ దిశలో కొనసాగాయన్న విషయం మాత్రం బయటకు రాలేదు.