: స్విట్జర్లాండ్ తీరుపై ఆగ్రహించిన చిదంబరం
స్విట్జర్లాండ్ తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఒకింత ఆసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్ లోని బ్యాంకులలో భారతీయులకున్న ఖాతాల వివరాలు ఇవ్వాలని ఎన్ని సార్లు కోరినా ఆ దేశం నుంచి స్పందన లేదని ఆయన అన్నారు. జీ20 వంటి అంతర్జాతీయ వేదికల వద్ద ఆ దేశాన్ని నిలదీస్తామన్నారు. ఇదే విషయమై స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రికి చిదంబరం ఒక లేఖ రాశారు. జీ20 దేశాలు 2009 ఏప్రిల్ లో జరిగిన సమావేశంలో బ్యాంకు రహస్యాల గోప్యతకు తెరదించే తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్ని లేఖలో చిదంబరం గుర్తు చేశారు. అంతేకాదు, స్విట్జర్లాండ్ ఇదే విధంగా వ్యవహరిస్తే ఆ దేశాన్ని సహకారమందించని దేశంగా ప్రకటిస్తామని హెచ్చరించారు.