: నటన వదిలేసి వెళ్లిపో: ఓ నటికి మరో నటి సూచన

బొద్దుగుమ్మ నమితకు.. ఆమెలా ఉండే తమిళనటి నిత్య ఓ జర్క్ ఇచ్చింది. చేతనైతే నటన వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లాలంది. తనకు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయంటూ ఇటీవల నమిత వెల్లడించింది. మరి ఆహ్వానాలు అందితే ఎందుకు వెళ్లలేదంటూ నిత్య ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు నమితకు కోపం తెప్పిస్తాయేమో? అని విలేకరులు అనగా, తాను నమితలానే ఉంటానని, అందరూ తనను చిన్న నమిత అంటారని, తనను చూశాక ఆమె ఏమీ అనలేరని వ్యాఖ్యానించింది. మొత్తానికి నమిత వెళ్లిపోతే, చిన్న నమితే హవా చెలాయించవచ్చని ఆశపడుతున్నట్లుంది.

More Telugu News