: తన ప్రేమను అంగీకరించలేదని తల్లిదండ్రుల్ని కడతేర్చాడు!
తన ప్రేమకు అభ్యంతరం చెబుతున్న తల్లిదండ్రుల్ని చంపి, అడ్డుతొలగించుకుందామనుకున్న ఓ యువకుడు హంతకుడిగా మారాడు. నల్గొండ జిల్లా దిండి మండలం వీరబోయినపల్లిలో తన ప్రేమను అంగీకరించలేదని, కన్న తల్లిదండ్రులను కొట్టి చంపాడో దుర్మార్గుడు. మద్యం మత్తులో అతను ఈ ఘాతకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.