: వాయు కాలుష్యానికి 70లక్షల మంది బలి
పెరిగిపోతున్న వాహనాలు.. అవి వెదజల్లే విష ఉద్గారాలు, ఇతర వాయు కాలుష్యం 2012లో ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది ప్రాణాలను కబళించాయి. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వాయు కాలుష్యమంటే కేవలం బయటదే కాదని, ఇళ్లలోని కాలుష్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన పర్యావరణ ఆరోగ్యాధిపతి మారియానీరా చెప్పారు. ప్రస్తుతం దీన్నొక పర్యావరణ ఆరోగ్య సమస్యగా పేర్కొన్నారు. 2012లో ప్రతీ 8 మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగా సంభవించినదేనన్నారు.