: మోడీపై పోటీకి కాలు దువ్వుతున్న డిగ్గీ రాజా

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఢిల్లీలో తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, 'వారణాసి బరిలో దిగేందుకు నాకేం అభ్యంతరం లేదు. అక్కడ పోటీ చేయాలంటే పార్టీ ముందు టికెట్ ఇవ్వాలి కదా?' అని పేర్కొన్నారు. వారణాసిలో మోడీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో... బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది.

More Telugu News