: ఆ ఇద్దరూ నమ్మకద్రోహులు: జశ్వంత్ సింగ్
బీజేపీ టికెట్ లభించకపోవడంతో బార్మర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ పార్టీ అధినాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తన పట్ల నమ్మకద్రోహం తలపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ నాథ్ ను పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించానని, వసుంధరను సీఎంగా సూచించానని... కానీ, వీరిద్దరూ తనకు టికెట్ దక్కకుండా చేశారని ఆరోపించారు. తిరిగి బీజేపీలోకి రమ్మని అద్వానీ, గడ్కరి అడిగారని... అయితే, తన కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించడంలేదని జశ్వంత్ తెలిపారు.