: ఆ భవనాలకు అద్దె ఉండదు..!

జూన్ 2వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న సచివాలయం, శాసనసభ ప్రాంగణాల్లోనే సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ భవనాలకు అద్దె కట్టాల్సిన అవసరం ఉండదు. అయితే, విద్యుత్తు బిల్లులు, నీటి ఛార్జీలు, ఇతరత్రా ఖర్చులన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునే భవనాల ఖర్చులను మాత్రమే ఆ ప్రభుత్వం భరిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. పేరుకు పదేళ్లు ఉమ్మడి రాజధాని అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిస్థితి అద్దె ఇంట్లో ఉన్న మాదిరిగానే ఉంటుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

ఉమ్మడి రాజధాని కొనసాగినంత కాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైదరాబాదులో ఇచ్చిన భవనాల్లో ఉచితంగానే ఉండవచ్చు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సి బ్లాక్ ను నూతనంగా ఏర్పడనున్న తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించే అవకాశం ఉంది. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రికి డీ లేదా జె బ్లాక్ లో సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ఏ ప్రభుత్వాలకు ఏ బ్లాక్ లను కేటాయించాలన్న అంశంపై గవర్నరు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

More Telugu News