: వ్యక్తిగత హోదాలోనే చంద్రబాబును కలిశా: టీఆర్ఎస్ అసమ్మతి నేత
టీఆర్ఎస్ అసమ్మతి నేత చెరుకు సుధాకర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలవడంపై వివరణ ఇచ్చారు. వ్యక్తిగత హోదాలోనే చంద్రబాబును కలిశానని తెలిపారు. బాబుతో భేటీపై మాట్లాడుతూ, గత కొంతకాలంగా పార్టీలో తనను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ ద్రోహులైన కొండా దంపతులను పార్టీలో ఎలా చేర్చుకుంటారని సుధాకర్ ప్రశ్నించారు. టికెట్ రాకపోతే ప్రత్యామ్నాయం ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు.