: బీసీల ఓట్లన్నీ టీడీపీకే... సెంటిమెంట్ పక్కన పెట్టండి: కృష్ణయ్య
రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకే పడతాయని అంటున్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానన్న టీడీపీకే బీసీల మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 45 ఏళ్ళుగా దొరలకు ఓట్లేశామని, ఇక సెంటిమెంట్ ను పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు కాకపోతే మరో వందేళ్ళు వచ్చినా తెలంగాణలో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడని కృష్ణయ్య పేర్కొన్నారు.