: శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుమల శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన కుటుంబసమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.