: కాంగ్రెస్ కోరితే మోడీపై వారణాసి నుంచి పోటీ: ఆనంద్ శర్మ
అత్యంత ముఖ్యమైన వారణాసి లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ, పార్టీ కోరితే అక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ప్రత్యర్థిగా తాను పోటీ చేస్తానని కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఓ ఆంగ్ల చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు వలస వెళ్లడాన్ని అవకాశవాదంగా పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా తన స్థానమని... అయితే, అక్కడున్న నాలుగు సీట్లలో కూడా సిట్టింగ్ ఎంపీలున్నారని.. అందుకే తాను అక్కడ నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు.
కాగా, బీజేపీ ప్రధాని అభ్యర్థి అభద్రతతో ఉన్నారని శర్మ వ్యాఖ్యానించారు. మోడీపై బీజేపీ చాలా విశ్వాసంతో ఉన్నప్పుడు రెండు స్థానాల నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. అదే సమయంలో రాహుల్ కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేయడంపై స్పందించిన శర్మ, తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.