: బస్సుయాత్ర ఎవడు చూస్తాడు?: రేణుకా చౌదరి

కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన నేతలు పదవీ వ్యామోహంతోనే పార్టీని వీడుతున్నారని ఆ పార్టీ నేత రేణుకాచౌదరి విమర్శించారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, పార్టీలు మారుతున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు. బస్సు యాత్రను ఎవడు పట్టించుకుంటాడని, ఎన్నికల రోజున ఎవరికి ఓటు వేయాలనిపిస్తే వారికే ఓటు వేస్తారని అన్నారు. పార్టీ వీడేవారిలో కొందరికి పదవీ వ్యామోహం ఉంటే మరి కొందరికి, 'పెదవీ' వ్యామోహం ఉందని ఆమె దుయ్యబట్టారు.

More Telugu News