: సీమాంధ్రకు పరిశ్రమలు రాబోతున్నాయి: రఘువీరా

కాంగ్రెస్ చేసిన గొప్ప పని వల్ల సీమాంధ్రకు పరిశ్రమలు రాబోతున్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. శ్రీకాకుళంలో బస్సుయాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సేవలపై కరపత్రాలు పంచుతున్నామని అన్నారు. శ్రీకాకుళం జల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేస్తామని అన్నారు. వివిధ పార్టీలు రాష్ట్రాన్ని విభజించమని కోరాయని, ఆ లేఖలు తమ వద్ద ఉన్నాయని ఆయన సభికులకు చూపించారు.

More Telugu News