: వైకాపా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని కోర్టుకు తరలించిన పోలీసులు
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాయదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రామచంద్రారెడ్డి ఫొటోలున్న గడియారాలను రాయదుర్గం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి చీరలు, కుక్కర్లు, క్రికెట్ సామాగ్రి, 43 లక్షల విలువైన చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కాసేపటి క్రితం కోర్టులో హాజరుపరిచారు.