: పసి కూనల మధ్య ఆసక్తికర పోరు

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఏ-విభాగంలోని చివరి స్థానం కోసం జరుగుతున్న పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం నుంచి పసికూనగా పరిగణించబడుతున్న జింబాబ్వే, యూఏఈ తో తలపడుతోంది. ఎన్నో దశాబ్దాల అనుభవమున్న జింబాబ్వే జట్టు నానాటికీ తీసికట్టు ఆటతీరుతో అట్టడుగున నిలిచి పసికూనలతో పోరాడుతోంది.

అక్కడ కూడా నిలకడైన ఆటతీరు ప్రదర్శించలేక చతికిలబడుతోంది. అంతర్జాతీయంగా జింబాబ్వే జట్టును అందరూ మర్చిపోతున్న దశలో, మరోసారి తన ఉనికిని కాపాడుకునేందుకు ఒక అవకాశంగా జింబాబ్వే నేటి మ్యాచ్ ను భావిస్తుండగా, అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి ఘనంగా అడుగుపెట్టాలని యూఏఈ భావిస్తోంది. దీంతో రెండు పసికూనల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.

More Telugu News