: రేపటి నుంచి చిరంజీవి బస్సు యాత్ర
కేంద్ర మంత్రి చిరంజీవి రేపటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో బస్సు యాత్ర చేపడుతున్నారు. శ్రీకాకుళం నుంచి ఈ యాత్ర ఆరంభం కానుంది. ఇందుకోసం చిరంజీవితోపాటు రఘువీరారెడ్డి కూడా విశాఖ చేరుకున్నారు. విభజనకు కారకులెవరన్న నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడమే తమ బస్సు యాత్ర ఉద్దేశమని వారు స్పష్టం చేశారు.