: అద్వానీ ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు: రాజ్ నాథ్

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీ గాంధీనగర్, భోపాల్ లలో ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చని అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఆయనపై ఎలాంటి ఒత్తిడి ఉండదని ఈ మేరకు తమిళనాడులో మీడియా సమావేశంలో తెలిపారు. ఆయనను పక్కన పెట్టామనేది తప్పుడు ప్రచారమన్నారు. తొలుత గాంధీనగర్ నుంచే పోటీ చేయాలని బీజేపీ కోరిన సంగతి తెలిసిందే. అయితే, తాను భోపాల్ నుంచే పోటీ చేస్తానని అద్వానీ మంకుపట్టుపట్టారు. ఆయనతో మోడీ, సుష్మ, జైట్లీ, పలువురు చర్చించినా ఫలితం లేకపోయింది. దాంతో, పార్టీ అగ్రనేతలు ఆయన ఇష్టానికే వదిలేశారు.

More Telugu News