: చిరంజీవికి విశాఖ అభిమానుల ఝలక్
మెగాస్టార్ చిరంజీవికి విశాఖ అభిమానులు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన బస్సు యాత్రను బహిష్కరిస్తున్నట్టు చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రాఘవరావు స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, సామాజిక న్యాయం చేస్తానని చెప్పి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, చిరంజీవి తమను నిలువునా ముంచేశారని విమర్శించారు. ప్రశ్నించడం కోసం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తే పరవాలేదు కానీ, పోటీ అంటేనే ఇబ్బందులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.