: ప్రియురాలి హత్యకు ముందు రాత్రి బూతు చిత్రాలు చూసిన పిస్టోరియస్

ప్రియురాలు రీవా స్టీన్ క్యాంప్ హత్య కేసులో బ్లేడ్ రన్నర్, దక్షిణాఫ్రికాకు చెందిన స్ప్రింట్ రన్నర్ పిస్టోరియస్ కు వ్యతిరేకంగా ఆధారాలు బలపడుతున్నాయి. పిస్టోరియసే ప్రియురాలిని హత్య చేసినట్లు విచారణాధికారులు పేర్కొంటున్నారు. జోహెన్నెస్ బర్గ్ లో 2013 ఫిబ్రవరి 14న పిస్టోరియస్ నివాసంలోని బాత్రూమ్ లో స్టీన్ క్యాంప్ హత్యకు గురైంది. తనకేపాపం తెలియదని పిస్టోరియస్ అంటున్నా... బాలిస్టిక్స్ (తుపాకులకు సంబంధించిన) నిపుణులు మాత్రం పిస్టోరియస్ రెండు అడుగుల సమీపం నుంచే బాత్రూమ్ లోపల స్నానం చేస్తున్న ప్రియురాలు స్టీన్ క్యాంపుపై కాల్పులు జరిపినట్లు తేల్చారు. ఈ మేరకు వారు నివేదికను కోర్టుకు సమర్పించారు. ఇక, ప్రియురాలిని హత్య చేయడానికి ముందు రోజు రాత్రి పిస్టోరియస్ తన ఐపాడ్ లో బూతు చిత్రాలను వీక్షించినట్లు వెల్లడైంది. వచ్చే వారం ఈ కేసు విచారణ ముగియనుంది.

More Telugu News