: వారణాసిలో మోడీపై దిగ్విజయ్ సింగ్ పోటీ?
వారణాసిలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను పోటీకి దింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తోంది. మోడీపై పోటీకి తాను సిద్ధమేనని దిగ్విజయ్ కూడా తన సమ్మతిని తెలియజేశారు. ఈ నేపథ్యంలో నేడు వెలువడనున్న కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల నాలుగో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ నేడు సమావేశమై అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనుంది. మరోవైపు వారణాసిలో మోడీకి చెక్ పెట్టేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి బ్రాహ్మణుడైన సతీష్ చంద్ర మిశ్రాను రంగంలోకి దింపే యోచనలో ఉంది. తద్వారా అగ్రకుల ఓట్లను తమ వైపునకు తిప్పుకోవచ్చని ఆమె భావిస్తున్నారు.