: అమెరికాకు ఎదురొడ్డి... రష్యాకు భారత్ బాసట
క్రిమియా విషయంలో రష్యాపై ఆంక్షలు విధించాలన్న అమెరికా నిర్ణయానికి బారత దేశం అడ్డుతగిలింది. ఇతర పాశ్చాత్య దేశాల ఆలోచనలకు తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. రష్యాపై ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. గతంలో ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలపై కూడా ఆంక్షలు విధిస్తామంటే భారత్ ససేమిరా అంది. తాజాగా భారత దేశం తన విధానానికి కట్టుబడి ఉంది.
కొన్ని దేశాలు గ్రూపుగా ఏర్పడి ఆంక్షలు విధిస్తామని అంటే భారత్ సమర్థించదని స్పష్టం చేసింది. అంతకు ముందు రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కు అన్ని అంశాలను వివరిస్తూ లేఖ రాశారు. క్రిమియా ప్రజల ఆకాంక్ష మేరకు క్రిమియాను తమ దేశంలో విలీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్, అమెరికా తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి.