: మోడీపై డిగ్గీ రాజాను బరిలో దింపనున్న కాంగ్రెస్!

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసి నుంచి బరిలో దిగడం ఖాయమైన నేపథ్యంలో, ఆయనకు పోటీగా ఎవరిని దింపాలన్న విషయమై కాంగ్రెస్ ఓ నిర్ణయానికొచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అయితే మోడీకి దీటుగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. డిగ్గీ రాజా కూడా మోడీపై పోటీ చేసేందుకు ఉబలాటపడుతున్నట్టు సమాచారం. ఈమేరకు ఆయన పార్టీకి కూడా తన సంసిద్ధత వెల్లడించినట్టు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ బలమైన అభ్యర్థినే బరిలో దింపుతామన్న ప్రకటనలతోనే కాంగ్రెస్ సరిపెడుతోంది.

More Telugu News