: ఎనిమిది మంది కామాంధులను కటకటాల్లోకి నెట్టారు

హైదరాబాదులోని నయాపూల్ ప్రసూతి ఆసుపత్రి సమీపంలో గర్భిణిపై అత్యాచార యత్నం చేసిన ఘటనలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఇరవై అయిదేళ్ల మహిళపై ఆదివారం రాత్రి సామూహిక అత్యాచార యత్నం జరిగింది.

ప్రసూతి ఆసుపత్రికి వచ్చిన మహిళ మూసీ నది ఒడ్డుకు వచ్చినప్పుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. మద్యం మత్తులో ఈ దుశ్చర్యకు పూనుకున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. అడ్డుకోబోయిన బాధితురాలి భర్తపై నిందితులు కత్తులతో దాడి చేశారు. భార్యాభర్తల అరుపులు విని అటుగా వెళ్లేవారు రావడంతో నిందితులు పరారయ్యారు. వీరిని అదుపులోకి తీసుకున్న షాహినాయత్ గంజ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More Telugu News