: ధోనీ పరువునష్టం దావాపై జీ నెట్ వర్క్ స్పందన
తనపై అసత్య కథనాలు ప్రసారం చేశారంటూ జీ న్యూస్ నెట్ వర్క్ పై టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ మద్రాస్ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై జీ మీడియా కార్పొరేషన్ స్పందించింది. ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకుని తాము కథనాలు ప్రసారం చేయలేదని, దేశంలోని లక్షలాది మంది అభిప్రాయాలను ప్రతిబింబించామని తెలిపింది. టీమిండియా కెప్టెన్ కు భంగం వాటిల్లేలా ఎలాంటి ఫుటేజి ప్రసారం చేయలేదని, తాము పాత్రికేయ విలువలకు కట్టుబడి వ్యవహరించామని జీ న్యూస్ పేర్కొంది.