: ఎన్నికల తర్వాత టీడీపీ ఒక్కటే మిగులుతుంది: చంద్రబాబు
రాష్ట్రంలో ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ ఒక్కటే మిగులుతుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పార్టీలోకి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి తదితరులు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే అన్ని స్థానాల్లో గెలుస్తామన్న నమ్మకం కలుగుతోందని అన్నారు. టీడీపీకి ఓటేస్తే సీమాంధ్రలో బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తామని బాబు హామీ ఇచ్చారు. ఢిల్లీలో చక్రం తిప్పే శక్తి ఒక్క టీడీపీకే ఉందని స్పష్టం చేశారు. ఇక జగన్ పై వ్యాఖ్యానిస్తూ, ఎంపీ సీటుకు రూ.50 కోట్లు, ఎమ్మెల్యే సీటుకు రూ. 10 కోట్లు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు.