: ఐర్లాండ్ లో స్థిరపడనున్న గ్రేమ్ స్మిత్!
దక్షిణాఫ్రికా క్రికెట్ కు ఎనలేని సేవలందించి, తాజాగా క్రికెట్ కు వీడ్కోలు పలికిన కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఐర్లాండ్ లో స్థిరపడాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. వివాహం కూడా ఐర్లాండ్ లోనే చేసుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ కు అత్తారిల్లు బాగా నచ్చినట్టుంది. గతంలోనూ ఎన్నోసార్లు ఇదే విషయాన్ని చెప్పాడు స్మిత్. ప్రస్తుతం ఆసీస్ తో జరుగుతున్న టెస్టు ముగియగానే స్మిత్ కెరీర్ కు ముగింపు కార్డు పడనుంది. భవిష్యత్తులో ఈ క్రికెటర్ కూడా కామెంటేటర్ అవతారమెత్తితే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. చిన్న వయసులోనే కెప్టెన్సీ బరువు బాధ్యతలు తలకెత్తుకున్న ఈ ప్రతిభాశాలికి ఒక్కటే లోటు. టెస్టుల్లో సఫారీ జట్టును నెంబర్ వన్ పీఠం ఎక్కించినా, వన్డే వరల్డ్ కప్ ను సాధించడంలో మాత్రం స్మిత్ విఫలమయ్యాడు.