: 'హాకీ ఇండియా'కు ప్రభుత్వ గుర్తింపు

భారత హాకీలో కొంతకాలంగా నడుస్తున్న అనిశ్చితికి తెరపడింది. దేశంలో ఏకైక హాకీ సంఘంగా హాకీ ఇండియా (హెచ్ఐ) అవతరించింది. ఈ మేరకు హెచ్ఐకి ప్రభుత్వ గుర్తింపు లభించింది. తాజాగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ హెచ్ఐ కార్యదర్శి నరేందర్ బాత్రాకు లేఖ రాసింది. ఇకపై హెచ్ఐ ద్వారానే జాతీయ జట్టు ఎంపిక, ఇతర కార్యకలాపాలు సాగుతాయి. జాతీయ క్రీడా సంఘంగా గుర్తింపు పొందిన హెచ్ఐ... అంతర్జాతీయ హాకీ సమాఖ్యతో పాటు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం గుర్తింపు పొందాల్సి ఉంది. ఇప్పటివరకు దేశంలో హెచ్ఐ, ఇండియన్ హాకీ ఫెడరేషన్ (ఐహెచ్ఎఫ్) సమాంతర హాకీ వ్యవస్థను నడిపాయి. దీనిపై కేంద్రం ఎన్నోమార్లు నచ్చజెప్పినా, ఇరు వర్గాలు రాజీబాటలో నడిచేందుకు సమ్మతించలేదు.

More Telugu News