: బీహార్ ప్రభుత్వ వెబ్ సైట్లలో అభ్యంతరకర చిత్రాలు
బీహార్ ప్రభుత్వ వెబ్ సైట్ల సెక్యూరిటీ ప్రమాదంలో పడింది. ప్రభుత్వానికి సంబంధించిన ఫొటోలు, చిహ్నాలు ఉండాల్సిన చోట కొన్ని అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమవుతున్నాయి. వాటిలో ఆ రాష్ట్రానికి చెందిన ఆరోగ్య విభాగం వెబ్ సైట్ లో కొన్ని అభ్యంతరకర చిత్రాలు దర్శనమిస్తున్నాయని ఓ చానల్ తెలిపింది. ఆ చిత్రాలను జపాన్ హ్యాకర్లే అప్ లోడ్ చేశారని చెప్పింది. అయితే, ఆ సంఘటన గురించి బీహార్ ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన లేదని పేర్కొంది.