: ఇదేం ప్రాక్టీసు బాబూ...?: గవాస్కర్
టీమిండియా తాజా వైఫల్యంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ పరాజయ పర్వం అంతులేకుండా సాగిపోతోందని విమర్శించారు. ప్రాక్టీసు చేయకుండా మ్యాచ్ లో అడుగుపెడితే ఫలితాలు ఇలాగే ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీమిండియా మేనేజ్ మెంట్ గత కొంతకాలంగా అనుసరిస్తున్న ఆప్షనల్ ప్రాక్టీసు విధానాన్ని గవాస్కర్ తప్పుబట్టారు. జట్టులోకి వచ్చిన తర్వాత ఆటగాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండదని, మ్యాచ్ కు ముందు కచ్చితంగా సాధన చేయాల్సిందేనని ఈ దిగ్గజ ఓపెనర్ సూచించాడు.
ఇష్టముంటేనే ప్రాక్టీసు చేయండని మేనేజ్ మెంట్ వెసులుబాటు కల్పించడం తప్పుడు సందేశాలు పంపుతుందని వివరించాడు. ధావన్ నుంచి కోహ్లీ వరకు ఎవరైనా ప్రాక్టీసు మిస్సయితే, వారిని ఉపేక్షించరాదని సన్నీ స్పష్టం చేశాడు. ఆసియా కప్ లో టీమిండియా వరుసగా శ్రీలంక, పాకిస్థాన్ జట్లపై ఓటములతో ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించడంతో మాజీల విమర్శలు పతాకస్థాయికి చేరాయి. మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా మాట్లాడుతూ, భారత్ పాకిస్థాన్ తో మ్యాచ్ లో మరికొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. దినేశ్ కార్తీక్ మంచి వికెట్ కీపరే అయినా, కీలక సమయాల్లో పొరబాట్లు చేశాడని పేర్కొన్నాడు.