: త్వరలో నటనకు గుడ్ బై చెప్పనున్న రమ్య

నటి, మండ్య ఎంపీ రమ్య (కాంగ్రెస్) త్వరలో నటనకు గుడ్ బై చెప్పబోతోంది. ప్రస్తుతం మైసూరులో కన్నడ సినిమా 'ఆర్యన్' షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ సరసన ఆమె నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రెండు మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని... దిల్ కా రాజా, నీర్ దోసె, కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న(ఇంకా పేరు నిర్ణయించలేదు) సినిమాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పింది. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత కొత్త చిత్రాలను అంగీకరించనని తెలిపింది. నటన, రాజకీయాలకు ఒకేసారి న్యాయం చేయలేనని భావించే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది.

More Telugu News