: వెయిటింగ్ లిస్ట్ లోని టికెట్టు ఖాయమైతే సెల్ ఫోన్ కు సందేశం

వెయిటింగ్ లిస్ట్ లోని టికెట్లు ఖాయమైతే రైలు బయల్దేరడానికి మూడు గంటల ముందు ఇకపై సెల్ ఫోన్ కే సందేశం వస్తుంది. ఈ కొత్త విధానాన్ని నిన్న రైల్వే శాఖ సహాయ మంత్రి అధీర్ రంజన్ చౌధరి లాంఛనంగా ప్రారంభించారు. టికెట్లు ఖాయమయ్యాయా, లేక ఆర్ఏసీ వచ్చిందా, కోచ్ నంబరు, సీటు నంబరు తదితర వివరాలన్నీ ఈ సందేశంలో ఉంటాయి. ఒకవేళ టికెట్టు ఖాయమవ్వకపోతే మాత్రం ఎటువంటి సందేశం రాదు. ఇప్పటివరకు ఈ వివరాలను 139 నంబరుకు ఫోన్ చేసి గాని, రైల్వే వెబ్ సైట్ చూసి గాని తెలుసుకోవాల్సి వచ్చేది. దీంతో ఆ అవసరం తప్పింది.

More Telugu News