: చిన్నతరహా పరిశ్రమలే దేశానికి వెన్నుముక: ఆంధ్రాబ్యాంక్ చైర్మన్
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివని ఆంధ్రాబ్యాంక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీవీఆర్ రాజేంద్రన్ అన్నారు. 'చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆర్థిక నిర్వహణ' అనే అంశంపై ఫ్యాప్సీలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, 2020 నాటికి ఈ పరిశ్రమల ఉత్పత్తులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.