: పోయిన సెల్ ఫోన్ కు రూ.6లక్షల బిల్లు

జపాన్ లోని ఫుకోకాకు చెందిన ఒమోమో తనకొచ్చిన సెల్ ఫోన్ బిల్లు చూసుకుని గుండెలు బాదుకున్నాడు. కారణం.. బిల్లు మొత్తం 9,800డాలర్లు (రూపాయల్లో 6లక్షలు). పైగా ఆ బిల్లు తాను పోగొట్టుకున్న సెల్ ఫోన్ ది. గతేడాది డిసెంబర్ 29న స్పెయిన్ లోని బార్సెలోనాకు వెళుతుండగా.. ఒమోమో సెల్ ఫోన్ పోయింది. నెట్ వర్క్ ప్రొవైడర్ కు 15 గంటల్లో కాల్ చేసి ఫోన్ పోయినట్లు సమాచారం అందించి బ్లాక్ చేయించాడు. జపాన్ తిరిగి వెళ్లాక.. ఓ రోజు భారీ బిల్లు రావడంతో అతడికి దిమ్మ తిరిగింది. బిల్లు పరిశీలించి చూస్తే.. అతడు పోగొట్టుకున్న రోజు చేసుకున్న కాల్స్ వల్లే అంత మొత్తం వచ్చినట్లు అర్థమైంది. ఏం చేస్తా.. కట్టక తప్పదుగా? అంటూ అతడు నిట్టూరుస్తున్నాడు.

More Telugu News