: సుప్రీంను ఆశ్రయించిన రాజీవ్ హంతకుల కుటుంబాలు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు హంతకులను విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానంపై బాధిత కుటుంబాలు, ఇతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధిత కుటుంబాలకు చెందిన అబ్బాస్, జాన్ జోసెఫ్, తమిళనాడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అమెరికాయ్ నారాయణన్, మరో ముగ్గురు కోర్టులో నిన్న (ఆదివారం) ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. హంతకుల వైపు నుంచి కాకుండా ఈ నిర్ణయం బాధిత కుటుంబాలపై, మొత్తం సమాజంపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించాలని పిల్ లో పేర్కొన్నారు.
రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ నిర్ణయం ఉందని ఆరోపించారు. హంతకులకు క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్ర గవర్నర్ లేదా రాజ్యాంగ పరంగా రాష్ట్రపతికి ఉంటుంది. అంతేకానీ, వారిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఉంటుందని పిల్ లో ప్రశ్నించారు.
మరోవైపు హంతకులను విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం గత నెలలో కేంద్రానికి చేసిన సిఫారసు నేపథ్యంలో హంతకుల విడుదలపై సుప్రీం స్టే విధించి, నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.