: ఆర్డినెన్సులపై సంతకాలు చేయకండి.. రాష్ట్రపతికి కారత్ విజ్ఞప్తి

రాజకీయ లబ్ధి కలిగించే ఆర్డినెన్సులపై సంతకాలు చేయరాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సీపీఎం జనరల్ సెక్రటరీ ప్రకాష్ కారత్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేబినెట్ మరిన్ని సవరణలు చేసే అవకాశం ఉందని లేఖలో తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడమనేది దారుణ సమస్యలకు కారణమవుతుందని అభిప్రాయపడ్డారు. యూపీఏ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఏమీ చేయకుండా... చివర్లో ఆర్డినెన్సులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

More Telugu News