: తెలంగాణ ఇస్తే ఏఐసీసీ ఆఫీసులో పనిచేస్తానని కేసీఆర్ అన్నారు: దానం

ఏ పార్టీతో పొత్తు లేకున్నా 2009లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించిందని ఆ పార్టీ నేత దానం నాగేందర్ అన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్టీని సోనియా పాదాల వద్ద ఉంచుతానని, ఏఐసీసీ ఆఫీసులో పని చేస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారని... ఇచ్చిన మాట మీద ఆయన నిలబడాలని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెస్ దే నని స్పష్టం చేశారు. తెలంగాణలో సీమాంధ్రుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడతాయని అన్నారు. ఈ రోజు హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. మతతత్వ పార్టీలకు అధికారం కట్టబెడితే... హైదరాబాదులో శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారతాయని వెల్లడించారు.

More Telugu News