: ఢిల్లీలో కూర్చుని రాజకీయాలు చేయడం కాదు: పవన్ కల్యాణ్

ఢిల్లీలో కూర్చుని రాజకీయాలు చేయడం కాదు.. వైద్య సదుపాయాలు కల్పించడంపై నేతలు దృష్టి పెట్టాలని సినీ నటుడు పవన్ కల్యాణ్ సూచించారు. నెక్లెస్ రోడ్డులో ఈ ఉదయం జరిగిన వాక్ ను సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మనదేశంలో వైద్య సదుపాయాలు తగినన్ని లేవన్నారు. ప్రభుత్వాలు చేయలేకపోయినా.. ఇలాంటి సంస్థలు వైద్య సేవలపై అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇలాంటి వాటికి తన మద్దతు ఉంటుందన్నారు. గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కోసం హృదయ స్పందన ఫౌండేషన్ ఈ వాక్ ను నిర్వహించింది. ఇందులో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More Telugu News