: అద్దెలు పెంచిన బీఎస్ఎన్ఎల్

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్లు, బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల అద్దెలు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ ఓ ప్రకటన చేసింది. వన్ ఇండియా మంత్లీ ప్లాన్ ల్యాండ్ లైన్ వినియోగదారులు ఇకపై రూ.195 అద్దె రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అది రూ.180గా ఉంది. ఇక బ్రాడ్ బ్యాండ్ విషయానికొస్తే... రూ.250 ప్లాన్ వినియోగదారులు రూ.275, రూ.600 ప్లాన్ వినియోగదారులు రూ.630, రూ.400 ప్లాన్ వినియోగదారులు 424, ఇక రూ.2799, రూ.3699 ప్లాన్ వినియోగదారులు నెలనెలా మరో 200 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. నేటి నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వస్తుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

More Telugu News