: కాంగ్రెస్ వాళ్లతో ప్రమాదం... వాళ్లను నమ్మలేం: వెంకయ్యనాయుడు

సీమంధ్ర నేతలంతా తనను కలిశారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. వైజాగ్ లో మోడీ ఫర్ పీఎం సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడడం తనకు ఇష్టం ఉండదని, వారితో మహా ప్రమాదం అని, అయినప్పటికీ తాను వారితో మాట్లాడానని అన్నారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు సోనియా, రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఎవరూ సభలో లేరని అన్నారు.

ప్యాకేజీ ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు, సోనియా చేత బిల్లులో ఎందుకు ప్యాకేజీ గురించి రాయించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. లోక్ సభను లోకల్ సభ చేసేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసారాలు బంద్ చేయించారు, ఇష్టానుసారం ప్రవర్తించారని ఆయన అన్నారు. తాము ఒత్తిడి చేయడంతో సీమాంధ్రకు ప్యాకేజీ ఇచ్చారని ఆయన తెలిపారు. బీజేపీ గట్టిగా కృషి చేసి పరిశ్రమలు పెట్టేందుకు ఒత్తడి తెచ్చిందని అన్నారు. విశాఖ నుంచి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ చేయాలని తాము సూచించామని అన్నారు.

More Telugu News