: అవన్నీ మామూలే.. సద్దుమణుగుతాయి: గంటా

నేతలు పార్టీలు మారినప్పుడు విభేదాలు సాధారణమేనని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన వల్లే తాను పార్టీ మారాల్సి వచ్చిందని అన్నారు. గంటా రాకను విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనకాపల్లి నియోజకవర్గంలో దాడి, కొణతాల వైఎస్సార్సీపీ నుంచి బరిలోకి దిగనుండడంతో గట్టిపోటీ ఇవ్వాలంటే గంటా ఉండాల్సిందేనని బాబు నచ్చచెప్పడంతో ఆయన మౌనం వహించారని సమాచారం. గంటా ప్రెస్ మీట్ కు చింతకాయల, పప్పల చలపతిరావు గైర్హాజరయ్యారు.

More Telugu News