: హైదరాబాదులో 70 శాతం మంది కరకర నమిలేసేవాళ్ళే!

హైదరాబాదులో 70 శాతం మంది మాంసాహారులే. జీహెచ్ఎంసీ సర్వేలో వెల్లడైన వాస్తవమిది. వీరి మాంసాహార అలవాట్లను తీర్చేందుకు నగరంలో 3000 మాంసం దుకాణాలు పాటుపడుతున్నాయట. వాటిలో 960 మటన్ దుకాణాలు, 1077 చికెన్ స్టాళ్ళు, 681 బీఫ్ దుకాణాలు, 241 ఇతర మాంసాలు (పంది, చేపలు) అమ్మే దుకాణాలు ఉన్నాయి. ఏడవ మేయర్ల సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. ఇక, మామూలు రోజుల్లో హైదరాబాద్ ప్రజల మాంసం వినియోగం ఎలా ఉందంటే... రోజుకు 3 లక్షల కోళ్ళు, 8 వేల గొర్రెలు, మేకలు, 2,500 దున్నలు తెగిపడతాయట. అదే ఆదివారం రోజున 5 లక్షల కోళ్ళు, 15,000 గొర్రెలు, మేకలు, 5000 దున్నలకు మూడినట్టేనని జీహెచ్ఎంసీ నివేదిక వెల్లడిస్తోంది.

More Telugu News