: యువకులు బలిదానాలు ఇవ్వనందునే వర్గీకరణ జరగలేదు: మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మరోసారి మంద కృష్ణమాదిగ తెరపైకి తెచ్చారు. ఎన్నికల ముందు వర్గీకరణ అస్త్రాన్ని సంధించి... వర్గీకరణను సాధించి తీరుతామని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చెప్పారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మాదిగ యువకులు బలిదానాలు ఇవ్వనందునే సోనియా గాందీ వర్గీకరణకు మొగ్గు చూపలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1200 మంది ప్రాణాలు తీసుకున్న తరువాతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని ఆయన గుర్తు చేశారు. అయితే తమ జాతి ప్రజలు బలిదానాలు ఇవ్వబోరని, కాంగ్రెస్ పార్టీపై యుద్ధం చేసి వర్గీకరణ సాధించుకుంటారని ఆయన హెచ్చరించారు.