: నేటి నేతలు రాక్షసులు... కనీసం వారి భార్యలైనా వారికి ఓట్లేస్తారా?: దాసరి

ప్రశాంతంగా బ్రతుకుతున్న మనుషుల్ని రాక్షసులు సంహరిస్తుంటే మహావిష్ణువు ఏదో ఒక రూపంలో వచ్చి రాక్షసుల్ని సంహరించి ప్రపంచాన్ని కాపాడే వాడు. ఇదే విషయాన్ని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తాజాగా ప్రస్తుత పరిస్థితికి అన్వయించారు. మహాశివరాత్రి జాగరణ సందర్భంగా విశాఖలో టి.సుబ్బరామిరెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకరత్న దాసరి మాట్లాడుతూ, ఇప్పుడు కూడా అంతకంటే భయంకరమైన రాక్షసులు ఉన్నారని, ప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతుంటే వారిని, వారి జాతిని ముక్కలు చేసి, ఖండించి హననానికి పాల్పడుతున్నారని అన్నారు. వారు ఏ ప్రాంతానికి చెందిన వారో వారికే తెలియదని, వారికి కనీసం వారి భార్యలైనా ఓటేస్తారో లేదో తెలియదని దాసరి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కనీసం సర్పంచులుగా కూడా గెలవడం చేతకాని వారంతా నేడు రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఆ రాక్షసుల్ని నాశనం చేయాలని దేవుడిని వేడుకోవాలని దాసరి ప్రజలకు సూచించారు.

More Telugu News