: సాహితీ ప్రేమికుడు జానమద్ది మరిక లేరు

తెలుగు సాహితీ రంగానికి తన వంతు విశిష్ఠ సేవలు అందించిన ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి అనారోగ్యం కారణంగా ఈ ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన కడపలోని రిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన భౌతిక కాయానికి ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

1926లో అనంతపురం జిల్లా రాయదుర్గంలో హనుమచ్ఛాస్త్రి జన్మించారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే.. కడపలో సీపీ బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్ట్ నెలకొల్పి విజ్ఞాన విస్తృతి కోసం కృషి చేశారు. వివిధ పత్రికలలో 2500 వ్యాసాలు, 16 గ్రంథాలు రచించిన ఆయన మరణం సాహితీ రంగానికి ఒక లోటు.

More Telugu News