: కమనీయంగా సాగుతోన్న రామలింగేశ్వరుని కల్యాణోత్సవం

విజయవాడలోని యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపించి, వాటిని పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక, ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మ, మల్లికార్జునుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఈరోజు ఉదయం నుంచే భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలాచరించి మహాదేవుడిని దర్శించుకున్నారు.

కృష్ణా జిల్లాలోని పెదకళ్లేపల్లి దుర్గానాగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక, శివరాత్రి జాగరణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శివనామస్మరణతో స్వామిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు.

More Telugu News